'వాటి ద్వారా రూ. 28,600 కోట్లను సమీకరించే అవకాశం'

by Harish |
వాటి ద్వారా రూ. 28,600 కోట్లను సమీకరించే అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల పరిణామాల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ)లలో ప్రభుత్వం వాటాను పూర్తిగా ఉపసంహరిస్తే దాదాపు రూ. 28,600 కోట్లను సమీకరించగలదని కేర్ రేటింగ్స్ అభిప్రాయపడింది. 2021-22లో రూ. 1.75 లక్షల కోట్ల పెట్టుబడుల సమీకరణలో భాగంగా రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ప్రభుత్వ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ప్రైవేటీకరణ కోసం నాలుగు బ్యాంకులను ఎంపిక చేసినట్టు సంకేతాలు వినిపించాయి.

ఈ క్రమంలో కేర్ రేటింగ్స్ ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలపై విశ్లేషించింది. దీని ప్రకారం.. ప్రభుత్వం బీఓఐ, ఐఓబీలలో 51 శాతానికి ప్రభుత్వ వాటాను తగ్గించుకుంటే, రూ. 12,800 కోట్లకు సమీకరించగలదు. అలాగే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎం), సెంట్రల్ బ్యాంకులలో ఇదే తరహాలో 51 శాతానికి వాటాను తగ్గించుకుంటే రూ. 6,400 కోట్లను సేకరించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఐఓబీలో 95.8 శాతం, బీఓఎంలో 92.5 శాతం, సెంట్రల్ బ్యాంకులో 92.4 శాతం, బీఓఐలో 89.1 శాతం వాటాను కలిగి ఉంది. ‘ఐఓబీ అత్యధికంగా ఈక్విటీ మూలధనాన్ని కలిగి ఉంది. బీఓఐ ఇతర బ్యాంకులతో పోలిస్తే అత్యధిక మార్కెట్ ధరను కలిగి ఉందని’ కేర్ రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed