- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనసేనానికి గవర్నర్ అభినందనలు
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామం నుంచి 30 మంది మత్స్యకారులు తమిళనాడు తీర ప్రాంతానికి చేపల వేటకు వెళ్లారు. అయితే లాక్‌డౌన్ కారణంగా వారంతా చెన్నై హార్బర్‌లో చిక్కుకు పోయారు. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. మత్య్యకారులు అక్కడ వసతి, భోజన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని , వారికి తగు సదుపాయాలు కల్పించాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి విజ్జప్తి చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన పళనిస్వామి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి వారి బాగోగులను, భోజనం, వసతీని తమిళనాడు ప్రభుత్వం కల్పించింది. విషయం తెలియజేసిన మీకు ధన్యవాదములు అని పళనిస్వామి తెలిపారు. అయితే మత్స్యకారుల పట్ల జనసేనాని తీసుకున్న శ్రద్ధ అభింనందించదగ్గదని, మత్స్యకారుల ఇబ్బందులను నివారించడానికి తన వంతు పాత్రను పోషించిన పవన్‌కల్యాణ్‌ను, అందుకు తగినట్లు స్పందించిన
తమిళనాడు ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అభినందిస్తూ ట్విట్టర్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు.
Tags: Governor, congratulates, Pawan Kalyan, fishermen, THAMILANADU,CM PALANISWAMY