ఐసోలేషన్‌లో గవర్నర్

by Shamantha N |
ఐసోలేషన్‌లో గవర్నర్
X

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా మహారాష్ట్ర గవర్నర్ నివాసానికి కూడా కరోనా చేరింది. రాజ్ భవన్ లో పని చేసే ఉద్యోగుల్లో 16 మందికి శనివారం కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. త్వరలోనే కోవిడ్ పరీక్షలు చేయించుకోనున్నారు.

Advertisement

Next Story