ఆదివాసీలు క్షేమంగా ఉండాలి : గవర్నర్ దత్తాత్రేయ

by Aamani |
Himachal Pradesh Governor Dattatreya
X

దిశ, ఆదిలాబాద్: ఆదివాసీల అభ్యున్నతికి సర్కారు కృషి చేయాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతర‌ను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌లతో కలిసి దత్తాత్రేయ సందర్శించారు. వారికి గిరిజనుల డోలు, సన్నాయి వాయిస్తూ ఘనస్వాగతం పలికారు. గవర్నర్, మంత్రి, చైర్మన్‌లకు తెల్లని తలపాగాలు కట్టారు. అనంతరం నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. దత్తాత్రేయ మాట్లాడుతూ… మెస్రం వంశ పూజారులు, ఆదివాసీలు క్షేమంగా ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని, వారికి నాగోబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని దేవుడ్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత కేస్లాపూర్ నాగోబా జాతర‌కు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని పేర్కొన్నారు. పోడు భూములకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, వారి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ విష్ణు వారియర్, ఐటీడీఏ పీవో భావేశ్ మిశ్రా‌, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed