ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

by srinivas |   ( Updated:2021-01-26 00:58:24.0  )
ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా 72వ గణతంత్ర వేడుకలు జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన గవర్నర్ బిశ్వభూషణ్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. వేడుకలకు సీఎం జగన్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వివిధ శాఖలకు చెందిన శకటాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగిస్తూ రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం స్పష్టమైన అజెండాతో ముందుకు వెళ్తోందని, అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, భిన్నత్వంలో ఏకత్వం మా సిద్ధాంతం అని స్పష్టం చేశారు.

కొందరు ప్రజల మధ్య శాంతిని చెడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, ఇలాంటి వారిని అడ్డుకునేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలని నవరత్నాల్లో ప్రకటించామని, రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని వారి కోసం ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టామని గుర్తు చేశారు. రెండు దశల్లో ఇళ్లు అందించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని వివరించారు. ప్రతినెలా ఒకటో తేదీనే అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నామన్న గవర్నర్.. అధికార వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా, విజయవాడను శాసన రాజధాని, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed