- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
by Shyam |
X
దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద చేనేత కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరానికి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ సంఘీభావం తెలుపుతూ మాట్లాడుతూ.. నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత ఐదు నెలలుగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నా చేనేత కార్మికులకు ఒక్కో కుటుంబానికి నెలకు ఎనిమిది వేల రూపాయల జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో రాష్ట్ర బీజేపీ నాయకుడు కర్నాటి ధనంజయ, రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాస్, చేనేత ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ చెరుకు బిక్షపతి, బడుగు మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story