ఆ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: చంద్రబాబు

by srinivas |
Chandrababu
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరులో ఊహించని పరిణామం చోటు చేసుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏలూరులో ఏం జరిగిందో ప్రభుత్వమే తెలుసుకోవాలని తెలిపారు. క్లోరినేషన్ సరిగా జరిగిందో లేదో ప్రభుత్వం పరిశీలించాలన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందిచడంలో ప్రభుత్వానికి అవగాహన లేదని అన్నారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లే ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని విమర్శించారు ఏలూరు ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.

కేసులు వచ్చిన వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి ఉండాల్సిందని చెప్పారు. సీఎం, మంత్రులు పైపైన తిరిగితే సమస్య ఏం అర్థం అవుతుందని మండి పడ్డారు. తూతూ మంత్రం పర్యటనలతో పరిష్కారం ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు సీఎం ఏలూరులోనే బస చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed