తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథి

by Shyam |
తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ పార్థసారథిని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో పార్థసారథి మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. 1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన పార్థసారథి ఇటీవల ప్రిన్సిపల్ సెక్రటరీగా పదవీ విరమణ పొందారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కలెక్టర్‌‌గా, పలు హోదాల్లో పనిచేశారు. పార్థసారథి ఒకట్రెండు రోజుల్లో బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Next Story