- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జలదిగ్బంధంలో గవర్నమెంట్ ఆఫీస్
by Anukaran |
X
దిశ, జనగామ: గతకొద్ది రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లా మొత్తం అతలాకుతలమైపోయింది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు వచ్చి ఇళ్లలోకి చేరుతోంది. జనగామలో కూడా వర్షాల వల్ల రంగప్ప చెరువులో నీళ్లు మత్తడి దుంకి ప్రవహిస్తున్నాయి. దీంతో జిల్లా కేంద్రంలోని రోడ్లు, ఇండ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా అటవీ శాఖ కార్యాలయం వరద నీటిలో చిక్కుకుంది. ఇటు విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్లు పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇలా జనగామ జిల్లా కేంద్రంలో జనజీవనం అస్తవ్యస్థంగా తయారైంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Next Story