- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ భూమిపై సర్పంచ్, ఉపసర్పంచ్ కన్ను..?
దిశ, బాల్కొండ : బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ భూమిపై ప్రజాప్రతినిధులు కన్నేశారు. స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్‌లు సబీల్ కట్ట కందకాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం సబీల్ కట్టను సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఉపసర్పంచ్ సబీల్ కట్ట పనులకు సంబంధించిన కాంట్రాక్టు తీసుకుని నాసిరకంగా కల్వర్ట్ నిర్మించారన్నారు.
అది ఒక్క వానకే కూలిపోయేలా ఉందని విమర్శించారు. గతంలో 14 ఫీట్లు ఉన్న కట్టని స్థానిక ప్రజా ప్రతినిధులు ఇద్దరూ 6 ఫీట్లకు కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టకు ఇరువైపులా 110 గజాల మేరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని రూల్స్ ఉన్నాయని, అధికార పార్టీ నేతలకు ఆ రూల్స్ వర్తించవా అని ఆయన ప్రశ్నించారు. బంగారు తెలంగాణలో బాల్కొండ పరిస్థితి ఇలా ఉందని మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. సబీల్ కట్టను ఆక్రమించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అంబటి నవీన్, కార్యకర్తలు పాల్గొన్నారు.