- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సర్కార్ జాగా.. అక్రమార్కుల పాగా!
దిశ, నల్లగొండ: ప్రభుత్వ భూమిలో కబ్జాలపర్వం మొదలయ్యింది. రైతుల అవసరాల కోసం కేటాయించిన భూమిపై అక్రమార్కులు పాగా వేశారు. ఫలితంగా రూ.2 కోట్ల విలువైన భూమిని ఆక్రమించేశారు. ఇదంతా ఎక్కడో కాదు. యదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోనే. ఇంత జరుగుతున్నా.. చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు.
సబ్ మార్కెట్ యార్డుకు కేటాయించిన స్థలం..
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ఫలక్‌నామా గుట్ట వద్ద సబ్‌మార్కెట్ యార్డు నిర్మాణం కోసం సర్వే నంబర్ 114, 164, 151లలో నాలుగు ఎకరాల భూమిని కేటాయించారు. 2008 సంవత్సరంలో యార్డు నిర్మాణానికి రూ.60 లక్షలు సైతం నిధులు మంజూరు చేశారు. అప్పటి మంత్రి యార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ, కొంతమంది అక్రమార్కులు భూమి తమ పేరు మీద ఉందంటూ ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఫలితంగా యార్డు నిర్మాణం ఆగిపోయింది.
అధికారుల నిర్లక్ష్యమే కారణం..
యార్డు నిర్మాణానికి కేటాయించిన స్థలంలో రెండున్నర ఎకరాలకు పైగా కబ్జాకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ఆ స్థలంలో రాత్రికి రాత్రే గుడిసెలు వెలిశాయి. దీంతో గతంలో ఆర్డీఓ సూరజ్ కుమార్ ఆ భూమిని స్వయంగా పరిశీలించారు. భూమిని సర్వే చేయించి హద్దురాళ్లు నాటాలని, ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానీ, రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా ఒకసారి గుడిసెలను తొలగించారు. మళ్లీ అటువైపు చూడకపోవడం కబ్జాల పర్వం మరింతగా పెరిగిపోయింది.
పట్టా చేసుకున్న గ్రామపంచాయతీ సిబ్బంది..
నాలుగెకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది రియల్టర్లు ప్లాట్లుగా చేసి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొంత మంది బినామీ పేర్లతో గుడిసెలు వేశారు. అయితే ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన గ్రామపంచాయతీ సిబ్బంది భూమి కబ్జాకు పాల్పడడం విడ్డూరంగా ఉంది. ఈ భూమిలో గ్రామపంచాయతీ సిబ్బందే దాదాపు రెండు వేల గజాల వరకు కబ్జా చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ఓ సిబ్బంది ఏకంగా పంచాయతీ రికార్డుల్లో పట్టా చేసుకున్న వైనం సైతం వెలుగులోకి వచ్చింది. సదరు సిబ్బంది తన పేరు మీద 277 గజాల స్థలాన్ని రికార్డుల్లోకి ఎక్కించుకున్నాడు. ఇదంతా అధికారులకు తెలిసినా.. నోరు మెదపడం లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఓ ప్రజాప్రతినిధి అనుచరులే..
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరులే ప్రభుత్వ భూమికి పాల్పడ్డట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. సదరు ప్రజాప్రతినిధి పేరు చెప్పుకుని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో అధికారులు అటువైపు చూడడం లేదని విన్పిస్తోంది. అయితే ఈ వ్యవహారమంతా ఆ ప్రజాప్రతినిధికి తెలియకుండా అనుచరులు జాగ్రత్తపడుతున్నారు. ఇదిలావుంటే.. 277 గజాల ప్రభుత్వ భూమిని తన పేరు మీద చేయించుకున్న గ్రామపంచాయతీ సిబ్బందిపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకు సదరు పంచాయతీ సిబ్బందిపైన చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని రక్షిస్తారో.. లేదో వేచి చూడాల్సిందే.
tags: Yadadri district, government land encroachment, aggressors, staff of grama panchayat, RDO