- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
1980 నాటి స్థాయికి భారత రుణ రేటు: మోతీలాల్ ఓస్వాల్ !
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత రుణ రేటు జీడీపీలో 91 శాతానికి చేరుకునే అవకాశాలున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక తెలిపింది. కొవిడ్-19 వల్ల భారత్ సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు దారుణ స్థితిలో ఉన్నాయి. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వాలు రుణాల మీదే ఆధారపడాల్సి ఉంది. ఈ క్రమంలోనే భారత రుణ రేటు 1980 నాటి స్థాయికి చేరుకోవచ్చని నివేదిక పేర్కొంది. జీడీపీలో రుణాల నిష్పత్తి ప్రభుత్వం చేసే ఖర్చులను పరిమితం చేస్తుంది. ఇది ప్రభుత్వ వ్యయాలపై ప్రభావం చూపుతుంది. నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సమత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు జీడీపీలో 75 శాతాని చేరుకున్నాయని, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 92 శాతానికి, 2021-22 నాటికి 91.3 శాతానికి చేరుకునే అవకాశాలున్నాయని వెల్లడించింది.
రుణాల నిష్పత్తి దేశం రుణాలను తీర్చేందుకు ఎలాంటి అవకాశాలున్నాయో నిరూపిస్తుంది. ఈ నిష్పత్తి అధికంగా ఉంటే రుణాలను చెల్లించే సామర్థ్యం తక్కువ ఉన్నట్టు భావించవచ్చు. పెట్టుబడిదారులు దేశ రుణ నిష్పత్తిని బట్టి పెట్టుబడుల విషయంలో ఓ అంచనాకు వస్తారు. రుణాలకు నిధులు సమకూర్చగల ప్రభుత్వ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పెట్టుబడిదారులు తరచూ ఈ నిష్పత్తిని గమనిస్తారు. ప్రపంచబ్యాకు నివేదిక ప్రకారం..ఒక దేశం రుణాల నిష్పత్తి సుధీర్ఘ కాలంపాటు 77 శాతం కంటే ఎక్కువుంటే ఆర్థిక వృద్ధిని తగ్గిస్తుంది.