హోం క్వారంటైన్ లోకి గౌరారం

by Shyam |
హోం క్వారంటైన్ లోకి గౌరారం
X

దిశ, రంగారెడ్డి: షాద్ నగర్ పట్టణానికి చెందిన పాజిటివ్ వ్యక్తి లాక్ డౌన్ నిబంధనలను యథేచ్ఛగా తుంగలోకి తొక్కాడు. ఇష్టారాజ్యంగా తిరిగి ఇటు షాద్ నగర్ ను అటు బొంరస్ పేట్ మండలంలోని గౌరారం గ్రామాన్ని హడలెత్తిస్తున్నాడు. వికారాబాద్ జిల్లా బొంరస్ పేట మండలం గౌరారంకు చెందిన కిరాణ షాపు నడిపించే ఓ వ్యక్తిని కరోనా పాజిటివ్ వ్యక్తి కలిశాడు. కుల్కచర్ల మండలం బండేల్కిచర్ల బంధువును కూడా అతను కలిశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గౌరారం గ్రామానికి చెందిన 267 ఇండ్లల్లో 439 మందిని హోమ్ క్వారంట్లోనే ఉంచినట్లు మండల అధికారులు వివరిస్తున్నారు.

Advertisement

Next Story