చూపు లేని వారికి వరం… గూగుల్ ఏఐ గ్లాస్

by Shyam |
చూపు లేని వారికి వరం… గూగుల్ ఏఐ గ్లాస్
X

దిశ, వెబ్‌డెస్క్:
డచ్‌కి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ మరుగునపడి పోయిన గూగుల్ గ్లాస్ సాయంతో చూపు లేని వారికి దాదాపు చూపు కల్పించబోతోంది. దాదాపు అని ఎందుకు అన్నారంటే.. సాధారణంగా చూపు లేని వాళ్లు ప్రతి చిన్న విషయానికి వేరొకరి సాయం తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ గూగుల్ గ్లాస్ సాయంతో ఇక ఆ అవసరం ఉండదు. వారు స్వతంత్రంగా వారి పనులు వారు చేసుకోవచ్చు.

గూగుల్ గ్లాస్‌కి కొద్దిగా మాడిఫికేషన్స్ చేసి ఎన్విజాన్ అనే సంస్థ ఈ ఎన్విజన్ గ్లాసెస్ తయారు చేసింది. చూపు లేని వారు ఇవి ధరించినపుడు వారు చూసిన అన్నింటినీ చదివి వినిపిస్తుంది. అవి రోడ్డు మీద సిగ్నల్స్, బోర్డులు, పేపర్, పుస్తకాలు, మెసేజ్‌లు ఇలా ఏదైనా చదివి వినిపిస్తుంది. కేవలం ఇంగ్లిషులో మాత్రమే కాకుండా దాదాపు 60 భాషల్లో ఈ ఎన్విజన్ గ్లాసెస్ చదివి వినిపించగలదు. వారి సాఫ్ట్‌వేర్ వేగంలోనూ, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్‌లోనూ చాలా కచ్చితత్వాన్ని ప్రదర్శిస్తుందని ఎన్విజన్ వెల్లడించింది.

అప్పుడెప్పుడో విడుదలైన గూగుల్ గ్లాస్ మార్కెట్లో పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. కానీ కొన్ని కార్పోరేట్ సంస్థలకు మాత్రం గూగుల్ గ్లాస్ ఉపయోగపడింది. ఇప్పుడు అదే గూగుల్ గ్లాస్ టెక్నాలజీకి కొద్దిగా మార్పులు చేసి ఎన్విజాన్ వినియోగంలోకి తీసుకురాబోతోంది. దీంతో గూగుల్ గ్లాస్ ఉత్పత్తి కూడా ప్రాచుర్యం పొందనుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ఆర్డర్‌కి సిద్ధంగా ఉన్న ఈ ఎన్విజన్ గ్లాస్ ధర 1699 డాలర్లుగా నిర్ణయించారు. అయితే పూర్తిస్థాయి షిప్పింగ్ ప్రారంభమయ్యే 2099 డాలర్లు కానుంది. అయితే ఇంత ధర పెట్టి కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ కొన్నవారి జీవితం మాత్రం పూర్తిగా మారుతుందని, చూపు లేకపోయినా స్వతంత్రంగా బతకగలరని ఎన్విజన్ సంస్థ అంటోంది.

Tags: Envision, Google Glass, Blind people, Independance, readable glass

Advertisement

Next Story