మొన్న ట్విట్టర్.. నేడు గూగుల్.. ‘భారత్‌’ అంటే అంత అలుసా.?

by Shamantha N |
kashmir
X

దిశ, వెబ్‌డెస్క్ : మొన్న ట్విట్టర్ నేడు గూగుల్. భారతదేశంలో భాగమైన కాశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా చూపించేలా ప్రయత్నించాయి. దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ ఎన్ని వ్యాక్సిన్లు పంపిణీ అయ్యాయో తెలిపేందుకు గూగుల్ ఓ మ్యాప్‌ను రూపొందించింది. దీనిలో భాగంగా గూగుల్ రూపొందించిన మ్యాప్‌లో కాశ్మీర్‌ను భారతదేశంతో సంబంధం లేకుండా విడిగా చూపించింది. అయితే, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఈ మ్యాప్ విషయంపై అధ్యయనం చేసి గూగుల్ నుంచి వివరణ తీసుకొని అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Next Story