- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గూగుల్ సెర్చ్‌లో.. స్టెమ్ పాఠాలు
దిశ, ఫీచర్స్ : చాలా కాలం నుంచి గూగుల్ సెర్చ్ యాప్‌ను క్విక్ ఇన్ఫర్మేషన్, రిలవెంట్ లింక్స్ కోసం మాత్రమే ఉపయోగించుకున్నాం. అయితే ప్రస్తుతం మాత్రం మరింత సమాచారాన్ని యూజర్లకు అందిస్తోంది. ఇందులో భాగంగానే గూగుల్ సెర్చ్ యాప్.. పలు క్లిష్టమైన సైన్స్ అండ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ను అర్థం చేసుకోవడంతో పాటు వాటిని పరిష్కరించేందుకు ఉపయోగపడుతోంది. వివిధ అంశాలపై సమగ్రమైన సమాచారాన్ని సేకరించే శక్తివంతమైన వనరుగా మారింది. కాగా మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ విద్య కొనసాగిస్తున్న విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరం.
ప్రస్తుతం ‘రిమోట్ లెర్నింగ్’ అనేది ప్రపంచవ్యాప్తంగా బిగ్ ట్రెండ్‌గా కొనసాగుతున్నందున, విద్యా విషయాలను నేర్చుకోవడంలో అవసరమయ్యే వివిధ మార్గాలను గూగుల్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ హైలైట్ చేస్తోంది.
స్టెమ్ :
ఇంటర్ డిసిప్లినరీ అండ్ అప్లైడ్ విధానంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ సంబంధిత అంశాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన కాన్సెప్ట్ ‘స్టెమ్’. వీటికి సంబంధించిన ప్రతి అంశాన్ని గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా పొందొచ్చు. ఎడ్యుకేషనల్ ఓవర్ వ్యూస్, ఎగ్జాంపుల్స్‌తో పాటు వీడియోలు కూడా అందుబాటులో ఉంటాయి.
ప్రాక్టీస్ అండ్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ :
సైన్స్ అండ్ మ్యాథ్స్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కోసం గూగుల్‌లో శోధించవచ్చు. సంక్లిష్టమైన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌కు ఈజీగా సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు. ఉదాహరణకు.. “x ^ 2-3x-4 = 0” వంటి సమీకరణాల కోసం శోధిస్తే.. క్విక్ ఆన్సర్స్ పొందొచ్చు. ఈ సమాధానాన్ని ఇమేజ్ తీసుకోవడానికి గూగుల్ లెన్స్ ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు కెమిస్ట్రీలోని కాంప్లెక్స్ ప్రశ్నలకు కూడా సమాధానం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు.. NaCl యొక్క 0.50 మోల్స్ 2.5 లీటర్ల నీటిలో కరిగిపోతే… దాని మొలారిటీ ఎంత ?” అని కూడా ప్రశ్నించొచ్చు.
అగ్మెంటెడ్ 3డీ మోడల్స్ :
ప్రత్యక్ష ఉదాహరణలతో సైన్స్ సబ్జెక్ట్‌ను బాగా అర్థం చేసుకునేందుకు అగ్మెంటెడ్ 3డీ మోడల్స్ బాగా ఉపయోగనుండగా, రీడింగ్ రూమ్‌నే సైన్స్ ల్యాబ్‌గా మార్చుకునే అవకాశం అందిస్తోంది. కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్‌తో పాటు మరిన్ని అంశాలకు సంబంధించిన 200 కాన్సెప్ట్స్ ఏఆర్ మోడల్స్‌లో అందుబాటులో ఉన్నాయి.