గూగుల్ హెచ్చరిక.. క్రోమ్ వాడుతున్నారా అయితే..

by Shyam |   ( Updated:2021-07-19 03:37:14.0  )
గూగుల్ హెచ్చరిక.. క్రోమ్ వాడుతున్నారా అయితే..
X

దిశ, వెబ్‌డెస్క్ : గూగుల్ క్రోమ్ ఉపయోగించేవారికి గూగుల్ హెచ్చరికలు జారీ చేసింది. హ్యాకర్లు వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని అందుకోసం క్రోమ్ వినియోగ దారులందరూ వెంటనే గూగుల్‌ క్రోమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. విండోస్, ఆండ్రాయిడ్‌లో గూగుల్ క్రోమ్‌ను ఉపయోగించే వారు చాలామందే ఉంటారు. అయితే ఒపెరా, మైక్రోస్టాఫ్ట్‌ ఎడ్జ్‌ వంటి బ్రౌజర్‌లు కూడా గూగుల్‌ క్రోమియం బ్రౌజర్‌ ఇంజిన్‌పై ఆధారపడి ఉన్నాయి.

వీటిలో లోపం బయటపడటంతో గూగుల్ అప్రమత్తమయ్యింది. గూగుల్‌కు తెలియకుండానే హ్యాకర్లు డేటాను దొంగిలిస్తున్నారని తెలిపింది. గూగుల్‌ క్రోమియం బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్‌ చేసిన వినియోగదారులు దీనిని వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అయితే బ్రౌజర్ వెర్షన్ 91.0.4472.164 ఉపయోగిస్తుంటే మీరు ఈ లోపాన్ని నివారించవచ్చు. మీరు అప్‌డేట్‌ చేసుకోకపోతే హ్యాకర్లు మీ వ్యక్తిగత వివరాలు తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed