- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ స్ట్రీమ్ కొత్త ఫీచర్స్
దిశ, వెబ్‌డెస్క్: లైవ్ స్ట్రీమ్ సదుపాయాన్ని యూజర్‌లకు మరింత దగ్గరగా చేయడానికి సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా మూడు ఫీచర్‌లను విడుదల చేసింది. ఇందులో భాగంగా గతంలో గంటసేపు మాత్రమే ఉన్న లైవ్ స్ట్రీమ్ నిడివిని నాలుగు గంటలకు పెంచింది. అంటే ఇప్పుడు యూజర్‌లు నాలుగు గంటల పాటు తమ కంటెంట్‌ను లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. దీంతో పాటు కొత్తగా లైవ్ ఆర్కైవ్ ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా యూజర్‌లు తమ లైవ్ వీడియోలను 30 రోజుల వరకు సేవ్ చేయవచ్చు. ఈ ఆర్కైవ్ కేవలం వ్యక్తిగత యూజర్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతరులో దీన్ని షేర్ చేసుకోవడానికి వీలు కాదు. ఈ ఆర్కైవ్‌లో ఉన్న వీడియోలను ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్‌లోడ్ చేసి, ఐజీటీవీలో అప్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ రెండు ఫీచర్లతో పాటుగా ఐజీటీవీ యాప్‌లో ‘లైవ్ నౌ’ అనే బటన్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించి ఆ సమయంలో లైవ్ స్ట్రీమ్ అవుతున్న వీడియోలను అన్వేషించవచ్చు. ఈ కొత్త ఫీచర్ల గురించి ఇన్‌స్టాగ్రామ్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్న వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ లైవ్ స్ట్రీమ్ నిడివిని పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్ క్లాసులు చెప్పే వారు ప్రతి గంటకు ఒకసారి కొత్త లైవ్ స్ట్రీమ్ ప్రారంభించాల్సి వచ్చేది. కాగా ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ నిడివిని 4 గంటలకు పెంచడం ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా ఆన్‌లైన్ క్లాసులు చెప్పుకునే సౌకర్యం కలగనుంది.