ఆన్‌లైన్ మోసాలకు ‘స్కామ్ స్పాటర్’ అడ్డుకట్ట

by Sujitha Rachapalli |   ( Updated:2020-06-02 04:48:35.0  )
ఆన్‌లైన్ మోసాలకు ‘స్కామ్ స్పాటర్’ అడ్డుకట్ట
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరో వైపు ఆన్‌లైన్ స్కామ్స్ రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఈ రెండు మూడు నెలల్లోనే కరోనా పేరుతో లక్షల కోట్లు కొల్లగొట్టారు. కరోనా పాండమిక్ వేళ.. వారు ఇంతకు ముందుకంటే ఎక్కువ యాక్టివ్‌గా ఉన్నారని గూగుల్ వెల్లడించింది. ఈ క్రమంలో ఫిషింగ్, మాల్‌వేర్ అటాక్స్, ఆన్‌లైన్ స్కామ్స్ పెరగడంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు ‘స్కామ్ స్పాటర్’ పేరుతో గూగుల్ ఓ కొత్త వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది. ఇంటర్నెట్ యూజర్లు కామన్ స్కామ్స్‌ను ఐడెంటిఫై చేసేందుకు ఈ ‘స్కామ్ స్పాటర్’ తోడ్పడుతుంది. సాధారణంగా సైబర్ నేరగాళ్లు.. నెటిజన్లను నమ్మించేందుకు ప్రభుత్వ సంస్థలు, లాటరీ కంపెనీలు, బ్యాంకింగ్ సంస్థల పేరిట మెసేజ్‌లు చేస్తూ ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారని గూగుల్ పేర్కొంది. అయితే ప్రతి మనిషికి ‘సెన్స్ ఆఫ్ అర్జెన్సీ’ ఉంటుందని, దాన్ని ఆధారంగా చేసుకునే సైబర్ నేరగాళ్లు విక్టిమ్స్‌ను మ్యానిప్యులేట్ చేస్తుంటారని టెక్ నిపుణులు చెబుతున్నారు. కాగా ఇండియాలో కొవిడ్ 19 రిలేటెడ్ స్కామ్స్ జాబితాలో ‘లోన్ అమౌంట్‌పై డిస్కౌంట్, ఈఎమ్ఐ, యూపీఐ ఐడీ, డోనేషన్ ఫర్ సీఎమ్ ఫండ్, హాస్పిటల్, ఎన్జీవో ఆర్గనైజేషన్, ఆన్‌లైన్ లిక్కర్ డెలివరీ తదితర అంశాలున్నాయి. కరోనా వైరస్ పేరు మీద రానున్న రోజుల్లో స్కామ్‌ల వల్ల 2 బిలియన్ డాలర్ల డబ్బును నెటిజన్లు నష్టపోయే అవకాశం ఉందని గూగుల్ తెలిపింది.

స్కామ్ స్పాటర్ వెబ్ సైట్ ను గూగుల్, సైబర్ క్రైమ్ సపోర్ట్ నెట్ వర్క్ లు సంయుక్తంగా డెవలెప్ చేశాయి. బోగస్ స్టిమ్యులస్ చెక్స్, ఫాల్స్ వ్యాక్సిన్ ఆఫర్లు, ఫేక్ ఇన్ఫర్మేషన్, గిఫ్ట్ కార్డ్, సెండ్ మనీ, యూపీఐ పిన్ డిటేయిల్స్ ఇలాంటి మోసాలను ‘స్కామ్ స్పాటర్’ పట్టేస్తుంది. ఆన్ లైన్ స్కామ్స్ పై ప్రజలకు అవగాహన పెంచేందుకు వెబ్ సైట్ లో ‘క్విజ్’ అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు.. మీరు స్విట్జర్లాండ్ ట్రిప్ వెళ్లేందుకు ఎంపికయ్యారు అనే మెసేజ్ వస్తుంది. కానీ యూజర్ ఎలాంటి కాంటెస్ట్ లో కూడా పాల్గొనకుండా ట్రిప్ కు టికెట్ ఎలా వస్తుంది? రాదు కదా. ఇలా స్కామ్స్ ను ఈజీగా గుర్తించేందుకు ఈ క్విజ్ తోడ్పడుతుంది.

అయితే కొన్ని కామన్‌గా జరిగే స్కామ్‌లపై నెటిజన్లకు గూగుల్ కొన్ని టిప్స్ అందించింది.

నేరుగా విరాళాలు ఇవ్వండి

కరోనా వల్ల చాలా మంది తిండిలేక అల్లాడుతున్నారు. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని పేదల ఆకలి తీర్చడం కోసం లేదా హాస్పిటల్స్‌లోని రోగుల కోసం డబ్బులు డోనేట్ చేయండి, సాయపడండి అంటూ సైబర్ నేరగాళ్లు మెసేజ్‌లు చేస్తున్నారు. ఇలాంటివి అస్సలు నమ్మకూడదు. ఎవరైనా సరే మీకు తెలిసి ఆకలితో బాధపడితే.. డైరెక్ట్‌గా వెళ్లి వారికి దానం చేయండి లేదా ట్రస్టెడ్ ఎన్జీవోలకు మనీ ఇవ్వండి. చాలామంది వలంటీర్లు కూడా పని చేస్తున్నారు. వారికి డబ్బు రూపంలో కాకుండా ఆహారాన్ని అందించవచ్చు.

ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి

మెయిల్, మెసేజ్‌లో వచ్చిన లింకులపై క్లిక్ చేసేముందు వాటిని ఒకసారి ధృవీకరించుకోండి. ఇలాంటి వాటిల్లో ప్రధానంగా యూఆర్‌ఎల్ మిస్టేక్స్ ఉంటాయి. వాటిని గమనించాలి. స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉంటాయి. ఉదాహరణకు గవర్నమెంట్ మెసేజ్ అయితే gov అని ఉంటుంది. అదే తప్పుడు వెబ్‌సైట్ నుంచి వస్తే.. gOv అని ఉంటుంది.

వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు

ఎవరు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు. పాన్, ఏటీఎమ్ పిన్ నెంబర్లు షేర్ చేయొద్దు. యూఏఎన్ నెంబర్, సీవీవీ కోడ్ వంటి వాటిని కూడా చెప్పకూడదు. బ్యాంకు ఖాతా వివరాలు, ఇన్సూరెన్స్ పాలసీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు.

వస్తువులు, సేవల పేరుతో

మాస్కుల మీద, ఆన్‌లైన్ ఎంటర్టైన్‌మెంట్ అందించే సర్వీసులపై డిస్కౌంట్ అందిస్తామంటూ మోసం చేస్తూ ఉంటారు. ఉదాహరణకు జియో మూడు నెలల ఉచిత టాక్ టైమ్, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ నెల పాటు ఉచిత మెంబర్‌షిప్ వంటి మెసేజ్‌లు చేస్తారు. ఇటువంటి వాటిని అస్సలు నమ్మకూడదు.

Advertisement

Next Story