ఇక ఇంటర్నెట్ లేకున్నా గూగుల్ డ్రైవ్ సేవలు.. ఎలాగో తెలుసా..?

by Anukaran |   ( Updated:2021-09-05 02:33:12.0  )
ఇక ఇంటర్నెట్ లేకున్నా గూగుల్ డ్రైవ్ సేవలు.. ఎలాగో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్: గూగుల్ డ్రైవ్‌ను ఇక ఆఫ్‌లైన్ మోడ్‌‌లోనూ ఉపయోగించుకోవచ్చని బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది. వినియోగదారులు పీడీఎఫ్‌, ఆఫీస్ ఫైల్స్‌తో పాటు ఇమేజెస్‌ను కూడా ఆఫ్‌లైన్‌లో యాక్సెస్ చేయగలరని తెలిపింది. ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయకపోయినా బ్రౌజర్‌ని ఉపయోగించి ఫైల్‌లను తెరవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

గూగుల్ ఈ ఫీచర్‌ని 2019లో పరీక్షించడం ప్రారంభించగా, ఇది వెబ్‌లో గూగుల్ డ్రైవ్ ఉపయోగిస్తున్నప్పుడు నాన్-గూగుల్ ఫైల్ టైప్స్ ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచేలా మార్క్ చేయడానికి వినియోగదారులను అనుమతించింది. ఈ ఫీచర్ ఇప్పుడు వినియోగదారులందరికి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎవరైనా ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా దీన్ని యాక్సె్స్ చేయొచ్చు. Mac లేదా Windows‌ లో డెస్క్‌టాప్ యాప్ కోసం గూగుల్ డ్రైవ్ తప్పనిసరిగా ముందుగా ఇన్‌స్టాల్ చేయాలి. వెబ్‌లోని డ్రైవ్ సెట్టింగ్స్‌లో ‘ఆఫ్‌లైన్’ యాక్సెస్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత, సపోర్టెడ్ ఫైల్‌పై రైట్ క్లిక్ చేయడం ద్వారా ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవచ్చు.

ఈ ఫీచర్ గూగుల్ వర్క్‌స్పేస్ కస్టమర్‌లందరికి, అలాగే.. క్లౌడ్ ఐడెంటిటీ ఫ్రీ, క్లౌడ్ ఐడెంటిటీ ప్రీమియం, జీ సూట్ బేసిక్, బిజినెస్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. వ్యక్తిగత ఖాతాలు ఉన్న వారి కోసం గూగుల్ కూడా దీనిని అందుబాటులోకి తెస్తోంది. ఒకవేళ మీరు మీ 15 GB ఫ్రీ స్టోరేజ్ అయిపోతే, గూగుల్ డ్రైవ్‌లో కంటెంట్‌ను బ్యాకప్ చేసేందుకు అడిషనల్ స్టోరేజ్ కొనుగోలు చేయవచ్చు. ఇండియన్ యూజర్స్ నెలవారీ లేదా వార్షిక ప్లాన్స్ ఎంచుకునే అవకాశముంది. గూగుల్.. నెలకు రూ.130 కి 100 GB స్టోరేజ్ స్పేస్ అందిస్తుండగా, మరింత ఎక్కువ స్పేస్ కోసం 2TB స్టోరేజ్ స్పేస్‌ని నెలకు రూ.650 కి అందించే ప్లాన్‌ను పొందొచ్చు.

Advertisement

Next Story

Most Viewed