ఏబీ డివిలియర్స్‌పై గూగుల్ సీఈఓ‌ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |
ఏబీ డివిలియర్స్‌పై గూగుల్ సీఈఓ‌ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏబీ డివిలియర్స్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు శుక్రవారం రిటైర్‌మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన బ్యాటింగ్‌తోనే కాకుండా, మంచి మనస్తత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. డివిలియర్స్‌కి తన సొంత దేశంలోనే కాక భారత్‌లో కుడా చాలా మంది అభిమానులు ఉన్నారు. 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన డివిలియర్స్.. T20 సిరీస్‌లో భాగంగా ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం ఇన్నాళ్లు ఆడాడు. IPLలో డివిలియర్స్ 184 మ్యాచ్‌లలో 39.70 సగటుతో 5,162 పరుగులు చేశాడు. ఏబీ 360 ఆటకు సెలబ్రిటీలు సైతం ముగ్దులయ్యారు. ఏకంగా గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కుడా ఉన్నాడు. డివిలియర్స్ రిటైర్‌మెంట్‌పై స్పందించిన పిచాయ్.. “వాట్ ఏ లెగసీ, ఎప్పటికీ చూడడానికి నా ఫేవరెట్‌లలో ఒకటి!” అని ట్వీట్ చేశారు. డివిలియర్స్ రిటైర్‌మెంట్‌పై పిచాయ్ స్పందించడంతో ఏబీ అభిమానులు అది డివిలియర్స్ గొప్పతనం అని కొనియాడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed