ఇలా.. బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న గూగుల్

by Shyam |
ఇలా.. బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న గూగుల్
X

దిశ, ఫీచర్స్: టెక్ దిగ్గజం గూగుల్ సోమవారం 23వ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సెర్చ్ ఇంజిన్.. హోమ్ పేజీపై స్పెషల్ డూడుల్‌ను ప్రజెంట్ చేసింది. కేక్ రూపంలో ఉన్న యానిమేటెడ్ డూడుల్‌పై ‘23’ సింబల్‌ను ఇండికేట్ చేయడంతోపాటు గూగుల్ స్పెల్లింగ్‌లోని ‘L’ లెటర్‌ను బర్త్‌డే క్యాండిల్‌తో రీప్లేస్ చేసింది.

గూగుల్ ఫౌండేషన్ 1997లో ప్రారంభించినప్పటికీ.. అధికారికంగా 1998 సెప్టెంబర్ 27న స్థాపించబడింది. ఈ సంస్థకు సెర్గీ బ్రిన్, లారీ పేజ్ కో-ఫౌండర్లు కాగా, నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న సెర్చ్ ఇంజిన్ ఇదే కావడం విశేషం. ఇక ప్రస్తుత సీఈవో సుందర్ పిచాయ్ 2015 అక్టోబర్ 24న ఆ పదవిలో నియమితులయ్యారు. సెర్గీ బ్రిన్‌.. 1997లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ పాఠశాల కోసం స్టాన్‌ఫోర్డ్‌ను పరిశీలిస్తున్న లారీ పేజ్‌కు క్యాంపస్ మొత్తం చూపించే పని అప్పగించారు. మరుసటి సంవత్సరానికల్లా ఈ ఇద్దరు గూగుల్ కో-ఫౌండర్లుగా తమ డార్మ్ రూమ్స్‌లో సెర్చ్ ఇంజిన్‌ను నిర్మించి, మొదటి ప్రొటోటైప్‌ను అభివృద్ధి చేశారు. ఈ విధంగా 1998లో గూగూల్‌ ఆవిర్భవించింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజు గూగుల్‌లో 150కి పైగా భాషల్లో బిలియన్ల కొద్దీ సెర్చింగ్స్ జరుగుతున్నాయి. మొదటి సర్వర్‌ను బొమ్మల బ్లాక్‌లతో నిర్మించిన క్యాబినెట్‌లో ఏర్పాటు చేసిన ప్రారంభ రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా డేటా సెంటర్లలో సర్వర్లను నిర్వహించగలిగే స్టేజ్ వరకు చాలా మార్పులు జరిగాయి. అయితే ప్రపంచవ్యాప్త సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలనే గూగుల్ లక్ష్యం మాత్రం అలాగే ఉంది.

Advertisement

Next Story

Most Viewed