కరోనా హల్చల్.. మాస్క్ పెట్టిన గూగుల్

by Anukaran |   ( Updated:2021-04-06 02:42:18.0  )
కరోనా హల్చల్.. మాస్క్ పెట్టిన గూగుల్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు లక్ష దాటాయి. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ప్రభుత్వాలు ఆదేశాలిస్తూనే ఉన్నాయి. తాజాగా గూగుల్ కూడా కరోనా నియమాలను పాటించాలని తెలుపుతుంది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించింది. అంతేకాకుండా తన హోమ్ పేజీపై యానిమేటెడ్ గూగుల్ లెటర్స్ ని రూపొందించింది. ఈ లెటర్స్ లో ఒక్కో లెటర్ ని మాస్క్ తో కప్పేసినట్లు డిజైన్ చేసింది.

ఇక తన ట్విట్టర్ వేదికగా ప్రతి ఒక్కరికి కరోనా నియమాలను ఒక వీడియో ద్వారా గూగుల్ షేర్ చేసింది. ఆ వీడియో లో కరోనా వలన ప్రజలు కోల్పోయిన ఆనందాన్ని గుర్తుచేసింది. మాస్క్, శానిటైజ్, సామజిక దూరం పాటిస్తే అదే ఆనందం మళ్ళీ సొంతమవుతుందని తెలిపింది. ప్రస్తుతం గూగుల్ హోమ్ పేజీ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Next Story