ఏపీకి శుభవార్త.. మూడు మెడికల్ కాలేజీలు

by srinivas |   ( Updated:2020-03-21 07:07:34.0  )
ఏపీకి శుభవార్త.. మూడు మెడికల్ కాలేజీలు
X

కరోనా భయంతో ఆందోళన నెలకొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో మూడు మెుడికల్ కాలేజీలు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సక్షేమ శాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసినట్టు కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాలోని గురజాల, విశాఖ జిల్లాలోని పాడేరు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలలో ఈ మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. ఈ మూడు మెడికల్ కాలేజీలకు మొత్తం 975 కోట్ల రూపాయలు ఖర్చు కానుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు 325 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మొత్తం పెట్టుబడిని 60:40 శాతంగా భరించాలని పేర్కొంది. అంటే కేంద్ర ప్రభుత్వం 60 శాతం ( ఒక్కో కాలేజీకి 195 కోట్లు) నిధులు ఖర్చు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ( ఒక్కో కాలేజీకి 130 కోట్లు) ఖర్చు చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అవగాహనా ఒప్పంది కుదుర్చుకునేందుకు పత్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.

ఈ ఎంవోయూపై వీలైనంత త్వరగా సంతకాలు చేసి, స్టాంప్‌లు వేసి మళ్లీ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపాలని సూచించింది. కాగా, ఏపీని మెడికల్ హబ్ చేయాలని భావించిన గత ప్రభుత్వం, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం.. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి మూడు మెడికల్ కాలేజీలు కేటాయించింది.

tags: medical colleges, central government, ap,

Advertisement

Next Story

Most Viewed