- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలక్ట్రిక్ బైక్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త
దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్ బైక్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఓలా శుభవార్త తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై రూ.50 వేల వరకు సబ్సిడీ ప్రకటించింది. కేంద్రం తీసుకువచ్చిన FAME-II పథకం కింద. ఆగస్టు నెలలో ఈ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్కూటర్‌ను నేరుగా ఇంటి వద్దకే డెలివరీ చేయనుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 3.6kWhకి దగ్గరగా ఉంటుంది.
కాగా కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు సబ్సిడీలు ప్రకటిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రాయితీలు ఇస్తోంది. ప్రస్తుతం ఇంధనం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహకాలు అందిస్తుండటంతో.. కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.