నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ నోటిఫికేషన్ విడుదల

by Anukaran |
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ నోటిఫికేషన్ విడుదల
X

దిశ, ఏపీ బ్యూరో: నిరుద్యోగులకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 319 ట్రేడ్ అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. కంప్యూటర్ ఆపరేటర్, ఫిట్టర్, కార్పెంటర్, టర్నర్, మెషినిస్ట్, మెల్డర్, మెకానిక్ డిజిల్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 17లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హతల వివరాలు ఇవే:

కంప్యూటర్ ఆపరేటర్: ఈ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.7,700 వరకు స్కాలర్ షిప్ అందించనున్నారు.

ఫిట్టర్: ఈ విభాగంలో 75 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 8,050 స్కాలర్ షిప్ అందించనున్నారు.

కార్పెంటర్: ఈ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 7,700 స్కాలర్ షిప్ అందించనున్నారు.

టర్నర్: ఈ విభాగంలో 10 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.8,050 స్కాలర్ షిప్ అందించనున్నారు.

మెషినిస్ట్: ఈ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.8050 వరకు స్కాలర్ షిప్ అందించనున్నారు.

వెల్డర్: ఈ విభాగంలో 40 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు సాధించి ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 7,700 చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నారు.

డిజిల్ మెకానిక్: ఈ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 7,700 వరకు స్కాలర్ షిప్ అందించనున్నారు.

మిషన్ టూల్ మెయింటనెన్స్: ఈ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లకు మించకూడదు. ఎంపికైన వారికి నెలకు రూ. 8,050 వరకు స్కాలర్ షిప్ అందించనున్నారు.

ఎలక్ట్రీషియన్: ఈ విభాగంలో అత్యధికంగా 60 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 8,050 వరకు స్కాలర్ షిప్ అందించనున్నారు.

ఏసీ మెకానిక్: ఈ విభాగంలో 14 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8,050 వరకు స్కాలర్ షిప్ అందించనున్నారు. మరిన్ని వివరాలకు www.vizagsteel.com వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

Advertisement

Next Story

Most Viewed