- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉమ్మడి వరంగల్ ప్రజలకు శుభవార్త
దిశ, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు శుభవార్త. ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్, వరంగల్ అర్బన్, జనగాంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సెజ్ లను ముఖ్యమంత్రి మంజూరు చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఏనుమాముల మార్కెట్ యార్డ్ లో నిలిచిపోయిన క్రయ విక్రయాలను 65 రోజుల తర్వాత బుధవారం మంత్రి పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుకు అన్యాయం జరగకుండా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని వ్యాపారస్తులకు సూచించారు. రైతులకు సరైన ధర కల్పించేందుకు మార్కెట్ చైర్మెన్, జిల్లా కలెక్టర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ కలిసి రోజువారీగా సమీక్షించి రైతు పండించిన పంటకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. మేలు రకం మిర్చికి ధర రాని పక్షంలో కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటే మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటుతో పాటు పంట విలువలో వడ్డీ లేకుండా 75 శాతం అప్పుగా తీసుకునే అవకాశం ఉందన్నారు. వానా కాలంలో ప్రభుత్వం నిర్దేశించిన పంటలు వేస్తే రైతుకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం మంజూరు ఇచ్చిన ప్రతి యొక్క సెజ్ లో సుమారు వెయ్యి ఎకరాల భూమి సేకరించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, మేయర్ గుండా ప్రకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదానందం, తదితరులు పాల్గొన్నారు.