- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త
దిశ ఏపీ బ్యూరో: ఏపీఎస్ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ నిరోధానికి విధంచిన లాక్‌డౌన్ కారణంగా ఇంచుమించు రెండు నెలలపాటు బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలివ్వలేదు. మరోవైపు 6000 మంది ఉద్యోగులను తీసేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అనంతరం పేర్ని నాని వ్యాఖ్యలతో ఉద్యోగాలపై భరోసా ఏర్పడింది.
తాజాగా ఏప్రిల్ నెల జీతాలను చెల్లించాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, మొత్తం వేతనం కాకుండా వేతనంలో 90 శాతం చెల్లించాలని సూచించారు. దీంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాగా, ఏపీఎస్ ఆర్టీసీలో సుమారు 7,600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండడం విశేషం. మరోవైపు బస్సుల్లో ఇస్తున్న రాయితీలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఆర్టీసీ తెలిపింది. జర్నలిస్టుల రాయతీ మాత్రం కొనసాగుతుందని చెప్పింది.