- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న మినిమమ్ పే స్కేల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మినిమమ్ పే స్కూల్ వర్తింపజేయాలని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీలు.. మోడల్ స్కూళ్లలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం పేస్కేల్ వర్తింపజేయాలని ఉత్తర్వుల్లో పేర్కింది.
అయితే వీరిలో కన్సల్టెంట్లు, సలహాదారులు, ఓఎస్డీలకు పే స్కేల్ వర్తించదని తేల్చి చెప్పింది. దాంతోపాటు కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవ్ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి 5లక్షల రూపాయల సాయం.. సహజంగా మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.2లక్షల సాయం అందించనున్నట్లు జీవోలో పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల ఖజానాపై రూ.365 కోట్ల రూపాయల భారం పడనున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది.