చెన్నై‌లో భారీగా బంగారం పట్టివేత

by Shamantha N |
చెన్నై‌లో భారీగా బంగారం పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: చెన్నై ఎయిర్ పోర్ట్‌లో బుధవారం భారీగా బంగారం పట్టుబడింది. గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేస్తున్న 1.48 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.82.3లక్షల ఉంటుందని అంచనా. షార్జా నుంచి చెన్నై వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఐదుగురి నుంచి 1.2 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వీరంతా బంగారం ప్యాకెట్లను చెప్పుల్లో పెట్టుకొని వచ్చారు.ఇక దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఓ పాసింజర్ తన అండర్ వేర్‌లో 280 గ్రాముల బంగారాన్ని తీసుకువస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జీన్స్ ప్యాంటులో 731 గ్రాముల బంగారం..

జీన్స్‌ ప్యాంటులో దాచిన బంగారాన్ని చెన్నై ఎయిర్ పోర్టులోని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. బంగారాన్నిపేస్టుగా చేసి సన్నని కవర్లలో ఉంచి జీన్స్‌ ప్యాంటులోని బెల్ట్‌ భాగం వద్ద వీరు దాచారు. అది గుర్తించిన కస్టమ్స్ అధికారులు ఆ బంగారన్ని స్వాధీనం చేసుకున్నారు. 731 గ్రాముల బంగారం విలువ రూ.34.5 లక్షలు ఉంటుందని వారు వెల్లడించారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed