మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు

by Harish |
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బంగారం ధరలు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ప్రకటనలు మార్కెట్లకు అనుకూలంగా ఉండటంతో పసిడి ధరలు భారీగా క్షీణించాయి. రూ. 2,500 వరకు తగ్గిన పసిడి మంగళవారం నాటి పరిణామాల నేపథ్యంలో దేశీయ కమొడిటీ మార్కెట్లో మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 640 పెరిగి రూ. 48,710కి చేరుకుంది. కేంద్ర బడ్జెట్ తర్వాత పెరిగిన ధరలు ఈ వారంలో తిరిగి పెరిగే అవకాశాలున్నాయని కమొడిటీ మార్కెట్ల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 640 పెరిగి రూ. 48,710 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 590 ఎగసి రూ. 44,650 వద్ద ఉంది. బంగారం బాటలోనే పసిడి ధరలు సైతం పెరిగాయి.

మంగళవారం హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 2,000కు పైగా పెరిగి రూ. 75,200గా ఉంది. పరిశ్రమలతో పాటు నాణాల తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడంతో ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం చెన్నైలో రూ. 49,450 ఉండగా, ముంబైలో రూ. 47,890, ఢిల్లీలో రూ. 51,050, కోల్‌కతాలో రూ. 50,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో సైతం బంగారం భారీగా పెరుగుతోంది. ఔన్స్ బంగారం 1,850 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ ధరల పెరుగుదల కూడా దేశీయంగా పసిడి పెరిగేందుకు దోహదపడిందని మార్కెట్ నిపుణులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed