- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gold Price Today : మరోసారి 50 వేలు దాటేసిన బంగారం
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయిలకు చేరుకుంటున్నాయి. మార్చి నెల వరకు తగ్గిన పసిడి ధరలు మే నెలలో కరోనా సెకెండ్ వేవ్ పరిణామాలతో క్రమంగా పెరుగుతున్నాయి. ఓవైపు ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతున్న తరుణంలో బంగారంలోనూ పెట్టుబడులు పెరుగుతుండటం విశేషం. దేశీయంగా కరోనా సెకెండ్ వేవ్ కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నందున బంగారంపై వినియోగదారుల డిమాండ్ పెరిగిందని కోటక్ సెక్యూరిటీస్ తెలిపింది.
గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 50,100కు చేరుకుంది. ఢిలీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 50,900కు చేరుకోగా, ముంబైలో రూ. 49,600, చెన్నైలో రూ. 50,300, కోల్‌కతాలో రూ. 50,960, బెంగళూరులో రూ. 50,100గా ఉంది. వెండి సైతం బంగారం బాటలోనే పెరుగుతోంది. గురువారం నాటికి రూ. 75,700గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరల జోరు కొనసాగుతోంది. ఔన్స్ బంగారం 1,911 డాలర్లకు చేరుకోగా, వెండి 28.07 డాలర్లుగా ఉంది. డాలరు మారకం విలువ బలహీనపడటం, అమెరికా ప్రభుత్వం రుణాలపై వడ్డీ రేట్లను మరింత తగ్గించే నిర్ణయం తీసుకోవడం వంటి పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదలకు దోహదం చేశాయని కోటక్ సెక్యూరిటీస్ వెల్లడించింది.