- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ. 46 వేల మార్కును దాటిన బంగారం!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందనే ఆందోళనల మధ్య బంగారం ధరలు భారీ స్థాయిలో పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా సంక్షోభం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందనే సంకేతాలతో పెట్టుబడి దారులు బంగారంపై పెట్టుబడికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడి పెట్టడమే సురక్షితమని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా కేసులు పెరగడం, దీనికి తోడు మే 3 వరకూ లాక్‌డౌన్ పొడిగించడం వంటి పరిణామాలతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో బంగారం రూ. 1500 పెరిగింది. ఫ్యూచర్ మార్కెట్లో రూ. 46,700 కు చేరుకుంది. ఎమ్‌సీఎక్స్ జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ. 427 పెరిగి రూ. 46,785 ను తాకింది. మరికొద్ది రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.50,000 లను చేరుకునే అవకాశముందని, ఈ ఏడాది చివరి నాటికి రూ.55,000 ధర కూడా చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వెండి సైతం 1 శాతం పెరిగి రూ. 44,350 కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1727కు డాలర్లు ఉంది. ఔన్స్ వెండి 15.64 డాలర్లు ఉంది.
Tags: Gold Price, MCX, gold price, gold rate 7 years high, covid-19, coronavirus Silver