దిగొస్తున్న బంగారం!

by Harish |
దిగొస్తున్న బంగారం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇటీవల కొవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్‌పై సానుకూల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు బంగారంపై పెట్టుబడులు పెట్టినవారు నెమ్మదిగా మార్కెట్లకు బదిలీ అవుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో పురోగతి కారణంగా ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందని మదుపర్లు ఆశిస్తున్నారు. అంతేకాకుండా, అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూలంగా ఉండటం, అమెరికా అధ్యక్షుడిగా అధికారాన్ని బదిలీ చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించడం, రూపాం మారకం విలువ బలపడటంతో బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి.

మంగళవారం హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 980 తగ్గి రూ. 50,400 వద్ద ఉంది. ఇక, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 900 తగ్గి రూ. 46,600 వద్ద ఉంది. బంగారం బాటలోనే వెండి ధరలు సైతం క్షీణిస్తున్నాయి. మంగళవారం వెండి కిలో రూ. 2,200 తగ్గి రూ. 64,500కి చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారెట్ల పది గ్రాముల బంగారం చెన్నైలో రూ. 50,620 ఉండగా, ముంబైలో రూ. 50,800గా, ఢిల్లీలో రూ. 52,630, కోల్‌కతాలో రూ. 52,470, బెంగళూరులో రూ. 50,400గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed