- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ‘గోకల్ దాస్’ టెక్స్ టైల్ పరిశ్రమ
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రముఖ టెక్స్ టైల్ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. దేశంలో రెడీమేడ్ వస్త్రాల తయారీలో ప్రముఖ పరిశ్రమగా పేరుగాంచిన గోకల్ దాస్ కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్లో టెక్స్ టైల్ శాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
1100 మందికి ఉద్యోగాలు
కేటీఆర్ మాట్లాడుతూ సిరిసిల్లలోని పొద్దురు గ్రామ పరిధిలో సుమారు 65 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న అప్పారెల్ పార్కులో గోకల్ దాస్ కంపెనీ తన కార్యకలాపాలను కొనసాగించనుందన్నారు. సిరిసిల్ల కేంద్రంగా పవర్లూమ్ పరిశ్రమ తో పాటు స్థూలంగా టెక్స్టైల్, అప్పారాల్ పరిశ్రమకు అద్భుతమైన అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు శిక్షణ కార్యక్రమాలను సైతం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో టెక్స్ టైల్ పరిశ్రమలో ఇప్పటిదాకా ప్రధానంగా వస్త్రాల తయారీ ఉందని , ఈ కంపెనీ కార్యకలాపాల ద్వారా రెడీ టు వేర్, రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమ ప్రస్థానం ప్రారంభమైందని వెల్లడించారు.
అమెరికాకు ఇక్కడే నుంచే..
గోకల్ దాస్ ఇమేజెస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుమిర్ హిందూజా మాట్లాడుతూ కంపెనీలో సుమారు 1100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని, ఇందులో మహిళలకు 75 శాతం ఉద్యోగాలుఇస్తామన్నారు. సిరిసిల్ల చుట్టుపక్కల గ్రామాల పరిధిలో ఉన్న మహిళలకు అవసరమైన శిక్షణను తెలంగాణ ప్రభుత్వం తో కలిసి చేపడతామని తెలిపారు. రెడీమేడ్ వస్త్రాల తయారీలో విస్తృతమైన శ్రేణిలో కంపెనీ కార్యకలాపాలు ఉన్నాయన్నారు. ప్రపంచ స్థాయి బ్రాండ్లకు తమ కంపెనీ వస్త్రాలను సరఫరా చేస్తుందని, ప్రస్తుతం సిరిసిల్లలో ప్రారంభించబోయే ఫ్యాక్టరీ నుంచి అమెరికా, యూరప్ లోని ప్రముఖ బ్రాండ్ లకు దుస్తులను అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టెక్స్ టైల్ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహా రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.