- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డెక్కిన న్యాయవాదులు.. మాక్కూడా రక్షణ కావాలంటూ
దిశ, గోదావరిఖని: వరంగల్ సీనియర్ న్యాయవాది శంకరాచారిపై జరిగిన దాడికి నిరసనగా న్యాయవాదులు రోడ్డెక్కారు. న్యాయవాదులపై వరసగా దాడులు జరగడాన్ని నిరసిస్తూ స్థానిక గోదావరిఖని న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం స్థానిక గోదావరిఖని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలియజేశారు. న్యాయవాది శంకరాచారిపై దుండగులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారని, రోజు రోజుకు న్యాయవాదులకు రక్షణలేకుండా పోవడం బాధాకరమని తెలిపారు.
చట్టం అంటే కనీస భయం లేకుండా న్యాయవాదులపై వరసగా దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని త్వరలో తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్. శైలజ సభ్యులు ఎరుకల ప్రదీప్ కుమార్, గోషిక ప్రకాష్ మరియు దేశెట్టి అంజయ్య, వేల్పుల మురళీధర్ యాదవ్, గుల్ల రమేష్, గుడికందుల భూమయ్య, బోయిన శ్రీనివాస్, భారతీ దేవి చౌహన్, గజ్జల ప్రసన్న, ఇరుగురాళ్ల సంతోష్, పులిపాక రాజ్ కుమార్, తీట్ల సంపత్, సుద్దాల ప్రియాంక, వరలక్మి, సౌభాగ్య, షనవాజ్, జూనియర్ మరియు సీనియర్ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలియజేశారు.