శానిటరీ ఇన్ స్పెక్టర్ కు కోపం వచ్చింది.. మేకలను కూడా వదల్లేదు

by Sridhar Babu |

దిశ, వెబ్‌డెస్క్: మేకలు మొక్కలు తినడం సహజం. కానీ, మొక్కలు తిన్న మేకలకు అధికారులు జరిమానా వేయడం అరుదు. తింటే వేరే మొక్కలు తినాలి కానీ, ఈ మొక్కలను మీ మేకలు ఎలా తిన్నాయంటూ అధికారులు వాటిని నిర్బంధించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పెద్ద పెత్తున మొక్కలు నాటే కార్యక్రమం, వాటిని పరిరక్షించే చర్యలు తీసుకుంటుంది. అయితే, పాల్వంచలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను మేకలు తింటున్నాయి. ఇది గమనించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ వాటిని మున్సిపల్ ఆఫీసుకు తోలుకెళ్లాడు. మేకలు మొక్కలను తిన్నందుకు ఫైన్ వేస్తున్నామని.. యజమానులు ఫైన్ చెల్లించి వాటిని తీసుకెళ్లాలని తేల్చి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed