మనిషి ఆకారంలో మేకపిల్ల జననం..

by Aamani |   ( Updated:2021-06-08 03:37:59.0  )
మనిషి ఆకారంలో మేకపిల్ల జననం..
X

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా భైంసా మండలం సుంక్లి గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. మంజ్రీ ముత్యన్నకు చెందిన మేక అచ్చం మనిషిని పోలిన ఆకారంలో మేకపిల్లకు జన్మనిచ్చింది. విషయం తెలియడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

ఎప్పటిలానే వ్యవసాయ క్షేత్రంలో మేకలు మేపుతూ ఉండగా తన మేక ప్రసవించగా ఈ వింత ఘటన మంగళవారం వెలుగుచూసింది. అయితే, జన్మించిన కాసేపటికే మనిషిని పోలిన మేక మృత్యువాత పడినట్లు గొర్ల కాపరి గజ్జరాం తెలిపారు. కాగా, చనిపోయిన మేక పిల్లను చూసేందుకు జనం ఎగబడ్డారు.

Advertisement

Next Story