గృహలక్ష్మీ ద్వారా ప్రతి మహిళలకు నెలకు రూ.5000

by Shamantha N |
tmc
X

పనాజీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బరిలో దిగడానికి ప్రయత్నిస్తున్న మమతా నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ గోవా ప్రజలకు కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెలా రూ.5000 అకౌంట్లలో జమచేస్తామని ప్రకటించింది. గృహలక్ష్మీ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు టీఎంసీ నేత, గోవా టీఎంసీ ఇంఛార్జీ మహువా మోయిత్రా తెలిపారు. ‘రాష్ట్రంలోని 3.5 లక్షల కుటుంబాలకు చెందిన మహిళలు గృహ లక్ష్మి పథకం కిందకు వస్తారు. దీనిలో గరిష్ట ఆదాయ పరిమితి లేదు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుత గృహ ఆధార్ పథకంలో ఆదాయం ఆధారంగా అందజేస్తున్నారు’ అని తెలిపారు.

ప్రస్తుత కాషాయ ప్రభుత్వం కేవలం 1.5 లక్షల మందికి మాత్రమే రూ.1500 అందిస్తుందని అన్నారు. ‘వాస్తవానికి గృహ ఆధార్ పథకం అమలుకు సంవత్సరానికి రూ.270 కోట్లు అవసరం. కానీ చాలా మంది ప్రయోజనం పొందకపోవడం వల్ల గోవా ప్రభుత్వం కేవలం రూ.140 కోట్లు మాత్రమే వెచ్చిస్తుంది’ అని వెల్లడించారు. అయితే ఇప్పటికే కేజ్రీవాల్ ఆప్ పార్టీ కూడా మహిళలకు అనుకూలంగా సంక్షేమ పథకాలు తీసుకొస్తామని ప్రకటించింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు టీఎంసీ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed