గోవా సీఎం సావంత్‌కు కరోనా..

by Anukaran |
గోవా సీఎం సావంత్‌కు కరోనా..
X

దిశ, వెబ్‌డెస్క్ :

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా చాలా మంది సీనీ, రాజకీయ ప్రముఖులు వైరస్ బారిన పడుతున్నారు.తాజాగా గోవా మఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది.. కానీ, కరోనా లక్షణాలు లేవని.. హోం ఐసోలేషన్ లో ఉన్నానని’ ఆయన ప్రకటించారు.

ఇక మీదట ఇంట్లో నుంచే పాలన సాగిస్తానని.. ఇటీవల తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని.. ట్విట్టర్ ద్వారా సూచించారు. ఇదిలాఉండగా, ఏప్రిల్ నెలలో ఆ రాష్ట్రంలో సున్నా కేసులు ఉండగా.. ప్రస్తుతం నాలుగు వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Advertisement

Next Story