- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీబీఎస్ఈ ఫలితాల్లో ‘గ్లెన్‌డేల్ అకాడమీ’ జయకేతనం
దిశ, హైదరాబాద్: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో గ్లెన్‌డేల్ అకాడమీ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. మంగళవారం సీబీఎస్ఈ ప్రకటించిన ఫలితాల్లో గ్లెన్‌డేల్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతతో అన్ని సబ్జెక్టుల్లో అత్యుత్తమ మార్కులు సాధించారు.
సబ్జెక్టుల వారీగా చూస్తే.. హ్యుమానిటీస్ స్ట్రీమ్‌లో స్ఫూర్తి కార్తికేయన్ 96శాతం, సైన్స్ స్ట్రీమ్‌లో సోమారపు నందిని 95శాతం, కామర్స్ స్ట్రీమ్‌లో హర్షితా భాటి 93శాతం, సలీహా సిద్దిఖీ (ఇంగ్లీష్ 96/100), ధత్రి అదాలా (బయాలజీ 97/100), నేహా చింతాపట్ల (బిజినెస్ స్టడీస్ 98/100), మరియం ఫాతిమా (కెమిస్ట్రీ 95/100), నందిని సోమారాపు (కంప్యూటర్ సైన్స్ 96/100), ఇషాన్ సూరబ్ చాడా (ఎకనామిక్స్ 96/100), ఇబ్రహీం మహాజీర్ (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ 96/100), జై సిక్కా (ఫ్యాషన్ స్టడీస్ 100/100), సమా (చరిత్ర 98/100) మరియు సమా (లీగల్ స్టడీస్ 100/100) ఇలా చాలా మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. సీబీఎస్ఈ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడమే కాకుండా, విద్యాసంస్థకు మంచి పేరు తీసుకురావడం ఎంతో గర్వకారణమని గ్లెన్‌డేల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మిను సలూజా ఆనందం వ్యక్తం చేశారు.