కారుణ్య మరణాలకు అనుమతించండి

by Shyam |
కారుణ్య మరణాలకు అనుమతించండి
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: మాకు ఉద్యోగాలైనా ఇప్పించండి లేదా కారుణ్య మరణానికైనా అనుమతించండంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను2015 పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఆశ్రయించారు. అప్పట్లో జరిగిన కానిస్టేబుల్ నియామకాల్లో అవకతవకలు జరిగాయని , ఎన్నిసార్లు న్యాయస్థానం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఆర్‌సీ అనుమతి ఇస్తే కారుణ్య మరణాలకు సిద్ధపడతామని వారు ప్రకటించారు. రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్‌లో అవకతవకలు జరిగాయని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో బాధిత అభ్యర్థులతో కలసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ మానవతా రాయ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. 2015 నుండి కానిస్టేబుల్ ఉద్యోగాలు వస్తాయనే ఆశతో జీవిస్తున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్‌తో పాటు ఇతర ఏ ఉద్యోగాలు రాక ,పెళ్లిళ్లు కాక రోడ్డున పడ్డ తమకు చావే శరణ్యమని వాపోయారు.

తక్షణమే తమకు న్యాయం జరిగేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలని హెచ్ఆర్సీని వారు వేడుకున్నారు. బంగారు తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలు లేకపోగా, పలు రిక్రూట్ మెంట్‌ల్లో అవకతవకలు, అవినీతి పెద్దఎతున పెరిగిపోయిందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చట్ట సభల్లో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు మూడున్నర సంవత్సరాలుగా కోర్టులు , డీజీపీ కార్యాలయాలు దాటి తమ సమస్య బయటకు రావడం లేదని వారు అన్నారు. తమకు న్యాయం చేసేలా కమిషన్ చర్యలు తీసుకోవాలని వారు కోరారు .

Advertisement

Next Story