విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి

by srinivas |
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి
X

దిశ, ఏపీ బ్యూరో : విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని కోరారు. రెండు వారాలు అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్ వెళ్తానని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. విజయసాయిరెడ్డి విజ్ఞప్తిపై స్పందించిన సీబీఐ కోర్టు కౌంటరు దాఖలు చేయాలని సీబీఐను ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు గడువు ఇవ్వాలని సీబీఐ కోరింది. ఇరువురు విజ్ఞప్తులను పరిశీలించిన సీబీఐ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 16కి వాయిదా వేసింది.

Advertisement

Next Story