పేదలకు ఫ్రీగా వ్యాక్సిన్ ఇవ్వండి : మాయావతి

by Shamantha N |
పేదలకు ఫ్రీగా వ్యాక్సిన్ ఇవ్వండి : మాయావతి
X

లక్నో : దేశంలో పేదలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ రెండో దశ విజృంభిస్తున్న తరుణాన పట్టణాల్లోని వలసకూలీలు తిరిగి స్వగ్రామాలకు వలస బాట పట్టిన నేపథ్యంలో వారికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. లాక్‌డౌన్ భయంతో స్వగ్రామాలకు తిరిగి వస్తున్న వలసకూలీలకు ఉచిత ఆహారం, వసతి కల్పించాలని మాయావతి కోరారు. గతేడాది లాక్‌డౌన్ కారణంగా పేదలు, వలస కూలీలు చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పేద ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని అంబేడ్కర్ జయంతి రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story