- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య..
దిశ, గోదావరిఖని : పెళ్లి కావడం లేదని క్షణికావేశంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ఐబీ కాలనీలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన జూపాక కొమురయ్య సింగరేణిలో పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందాడు. తన చిన్న కుమారుడికి తన ఉద్యోగాన్ని పెట్టించాడు. ఈ క్రమంలోనే సింగరేణిలో తన తండ్రి పని చేసుకుంటున్న తనయుడికి ఇటీవల గోదావరిఖని ఐబీ కాలనీలో క్వాటర్ అలాట్‌మెంట్ అయ్యింది.
మరికొన్ని రోజుల్లో కొత్తింటికి కుటుంబ సభ్యులందరితో కలసి వెళదామనుకున్నారు. అయితే, జూపాక కొమురయ్య కూతురు చైతన్యకు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఒక్కటి కూడా సెట్ కాలేదు. ఓ వైపు తన తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో మనస్తాపం చెందిన చైతన్య.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఒకటవ పట్టణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధిత తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.