బాలిక ఆత్మహత్య.. కారణం తెలిస్తే షాక్!

by Sumithra |

దిశ, వెబ్ డెస్క్:మొబైల్ ఫోన్ ప్రస్తుతం మానవ జీవితాల్లో ముఖ్యమైపోయింది. నిద్ర లేచిన నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేతిలో మొబైల్ లేకపోతే ఏమీ తోచడం లేదు. మొబైల్ ఓ వ్యసనంలా మారింది. ఎంతలా అంటే అది లేకపోతే ప్రాణం తీసుకునేంతలా. తాజాగా హైదరాబాద్‌లో ఓ 15ఏళ్ల బాలిక ఎప్పుడూ చేతిలో మొబైల్ పట్టుకొని, ఏవో వీడియోలు చూస్తూ ఉంటోంది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఈ వ్యసనం నుంచి కుమార్తెను బయటకు తీసుకురావాలనుకున్నారు. దీంతో ఆమె ఫోన్ తల్లి తీసేసుకుంది. ఆ తర్వాత ఆఫీసుకు వెళ్లారు. వారు ఇంటికి తిరిగొచ్చే సరికే ఆ బాలిక ఉరేసుకొని కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story