- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాల్యాన్ని చిదిమేసే యత్నం..కట్ చేస్తే
దిశ, రంగారెడ్డి :
దేశం ఓ వైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతూ అగ్రరాజ్యాలతో పోటీ పడే స్థాయికి ఎదుగుతోంది. అదే సమయంలో వేళ్లూనుకున్న సాంఘిక దురాచారాలు మాత్రం ఎక్కడోచోట బయటపడుతూనే ఉన్నాయి. వీటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిషేధం ఉంది. అయినా కొందరు కాసులకు కక్కుర్తి ఇలాంటి వాటికి తెరతీస్తున్నారు.మన దేశంలో బాల్య వివాహాల నివారణకు కఠిన చట్టాలున్నా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందువల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. అలాంటి సంఘటనే సోమవారం రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.అభం శుభం తెలియని 12 ఏండ్ల చిన్నారిని 37ఏండ్ల వ్యక్తికి ఇచ్చి గుట్టు చప్పుడు కాకుండా వివాహం జరిపించారు. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని షాద్ నగర్, ఫరూక్ నగర్ మండలంలోని ఓ గ్రామంలో డబ్బులకు ఆశపడిన ఓ తల్లి ఇది వరకే పెండ్లయి, తండ్రి వయస్సున్న వ్యక్తితో తన కూతురుకి ఈ నెల 15న వివాహం జరిపించింది. విషయం ఆ నోటా ఈ నోటా ఐసీడీఎస్ అధికారులకు తెలియడంతో వెలుగులోకి వచ్చింది.ఈ క్రమంలోనే పెళ్లి చేసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులను ఫరూక్ నగర్ తహశీల్దార్ కార్యాలయానికి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వివాహం చేసుకున్న వ్యక్తి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉండగా, అతనికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. బాధిత చిన్నారిని హైదరాబాద్ చైల్డ్ వెల్ఫేర్‌కు తరలించారు. మైనర్‌ను పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు ఈ దురాచారానికి సహకరించినా వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు.