మైనర్‌పై 16ఏళ్ల బాలుడి రేప్.. వీడియో వైరల్!

by Sumithra |   ( Updated:2020-10-02 01:16:19.0  )
మైనర్‌పై 16ఏళ్ల బాలుడి రేప్.. వీడియో వైరల్!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో అమాయక బాలికలపై లైంగిక దాడులు, హత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. వీటి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. సమాజంలో ఆడపిల్లలపై లైంగిక దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోవడానికి ‘సోషల్ అవెర్‌నెస్’ లేకపోవడం కూడా కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అభం శుభం తెలియని బాలికపై లైంగికదాడి జరిగింది.

పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై 11తరగతి చదవుతున్న 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న బాలుడి స్నేహితుడు వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఈ ఘటన తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని గురుబరపల్లి పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. బాలిక తల్లి కొన్నేళ్ల కిందట మరణించగా, ఆమె తండ్రి ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు. ఆమె తమ్ముడు చదువుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాలిక ఉంటున్న ప్రాంతానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలుడు.. ఆమెను నదితీరం వద్దకు తీసుకెళ్లి రేప్ చేశాడు. ఆగస్టు 5న సాయంత్రం ఈ ఘటన జరిగింది. బాలుడి స్నేహితుడు మొబైల్ ఫోన్‌లో వీడియో చిత్రీకరించి, 9తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి పంపించాడు. అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది.

ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాలిక తండ్రి గురుబరపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.దీంతో నిందితులపై పొక్సో చట్టం, ఐటీ చట్టం కేసు నమోదు చేసి ఆదివారం నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story