'ఎవరు ఏమన్నా… ఒక్క వెంట్రుక కూడా పీకేది లేదు'

by Shyam |   ( Updated:2021-03-29 06:09:31.0  )
ఎవరు ఏమన్నా… ఒక్క వెంట్రుక కూడా పీకేది లేదు
X

దిశ, వెబ్ డెస్క్: అమ్మాయిలు… ముగ్ద మనోహర రూపం వారి సొంతం. నాజూకైన దేహం వారికే సాధ్యం. ముఖంపై ఒక చిన్న మొటిమ వచ్చినా ఎర్రగా కందే నగుమోమును చూస్తూ ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇక అవాంఛిత రోమాలు వస్తే అంతే సంగతులు. అవి పోయే వరకు గది దాటి బయటికి రారు. అలాంటిది ఒక 20 ఏళ్ళ అమ్మాయి ఏకంగా గడ్డాలు, మీసాలు పెంచితే… అమ్మాయి ఏంటి? గడ్డం , మీసం ఏంటి అనుకుంటున్నారా ? అవునండి.. అమెరికాకు చెందిన ఒక అమ్మాయి గడ్డాలు, మీసాలు పెంచుతూ తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటుంది. ఇంతకీ ఎవరి అమ్మాయి? ఎందుకు ఇలా ఉంది అనేది తెలుసుకుందాం.

క్లేడే వార్రెన్.. అమెరికా దేశానికి చెందిన ఒక అందమైన యువతి. ఆమెకు స్కూల్ కి వెళ్ళేటప్పుడే ముఖంపై మీసాలు రావడం మొదలయ్యాయి. ఇక వాటిని చూసి ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందుతూ వాటిని క్లీన్ చేసుకోమని చెప్పేవారు. కానీ క్లేడే వారి మాటను పట్టించుకోలేదు. ఆలాగే వాటిని పెరగనిచ్చింది. దీంతో ఆమె స్నేహితులు, ఆమెను చూసినవారు గేలి చేయడం ప్రారంభించారు. నువ్వు అబ్బాయివా? అమ్మాయివా? అంటూ ఏడిపించేవారు. ఐనా సరే క్లేడే మాత్రం గడ్డం, మీసం తీయడానికి ఇష్టపడలేదు. అలా ఇప్పుడు క్లేడే వయసు 27 ఏళ్ళు. ప్రస్తుతం ఆమె అచ్చు అబ్బాయిలానే కనిపిస్తుంది. ఇక ఈ విషయమై క్లేడే ఎప్పుడు బాధపడింది కూడా లేదట.

“కొంతమంది చర్మ నల్లగా ఉందని, ఇతర సమస్యలు ఉన్నాయని బాధపడతారు. కానీ నేనెప్పుడూ నా చర్మం గురుంచి బాధపడలేదు. మన చర్మతో మనం సౌకర్యంగా ఉండాలి. అదే నేను చేస్తున్నా.. ఈ విషయంలో ఎదుటివారు ఏమన్నా నేను పట్టించుకోను … ఒక్క వెంట్రుక కూడా కట్ చేయించుకోలేను అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంగా” చెప్తుంది.

Advertisement

Next Story

Most Viewed