- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ, నారాయణఖేడ్:
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కంగ్టి మండలం చప్టా (కె) గ్రామంలో నీటి కుంటలో పడి చిన్నారి శనివారం మృతి చెందింది. గ్రామస్తుల వివరాల ప్రకారం… చప్టా (కె) గ్రామంలోని కుర్మ మాణిక్య గొండ, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. లక్ష్మీ తన మూడో కుమార్తె గాయత్రి(8)తో కలిసి శనివారం ఉదయం బట్టలు ఉతికేందుకు గ్రామ శివారులోని నీటి కుంటలోకి దిగింది. బట్టలు ఉతుకుతున్న సమయంలో గాయత్రి కాలు జారి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయింది. కూతురు కనిపించకపోవడంతో తల్లి లక్ష్మీ ఆందోళనకు గురైంది. చుట్టు పక్కల వారి సహాయంతో నీటిలో మునిగిన బిడ్డను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా 108లో తరలిస్తుండగా మార్గ మధ్యలో గాయత్రి చనిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు.
Advertisement
Next Story